అవలోకనం
OpenAIలో మేము అందరి ప్రయోజనం కోసం అధునాతన కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యమిస్తాము. ఈ నమూనాలు మీ వ్యాపారానికి కీలకంగా ఉండవచ్చని లేదా మీ దైనందిన జీవితంలో భాగంగా ఉండవచ్చని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల, వాటి వినియోగంలో ఏ అంతరాయం ఏర్పడినా మీకు విసుగు కలగవచ్చని మాకు తెలుసు.
మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పటికీ, సురక్షితమైన పని వాతావరణాన్ని కొనసాగించడం కూడా మాకు అవసరం. మా సహాయ సేవల ద్వారా మమ్మల్ని సంప్రదించేటప్పుడు దుర్వ్యవహారాన్ని మేము సహించము. కించపరిచే లేదా అవమానకరమైన భాష వాడటం, వ్యక్తులకు లేదా ఆస్తికి హాని చేస్తామని బెదిరించడం, అవతలివారికి ఇష్టం లేని ప్రవర్తనను పదేపదే కొనసాగించడం, ఇలాంటి ఇతర చర్యలు దుర్వ్యవహారం కిందకు వస్తాయి. దుర్వ్యవహారం వీటికే పరిమితం కాదు.
అందరికీ సురక్షితమైన, నిర్మాణాత్మక వాతావరణాన్ని కల్పించడానికి, దుర్వ్యవహారానికి లేదా బెదిరింపులకు పాల్పడే వినియోగదారులపై కింది చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్యలు వీటికే పరిమితం కావు.
లిఖితపూర్వక లేదా మౌఖిక హెచ్చరికలు
సహాయ సేవల వినియోగాన్ని పరిమితం చేయడం లేదా నిలిపివేయడం
OpenAI ఉత్పత్తులు, సేవల వినియోగాన్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడం
హాని చేస్తామనే బెదిరింపులు నిజమయ్యే అవకాశం ఉందని భావిస్తే అధికారులకు తెలియజేయడం
అత్యుత్తమ సహాయం అందించడానికి, మీకు ఉన్న ఏవైనా ప్రశ్నలకు సమాధానమివ్వడానికి లేదా ఆందోళనలను పరిష్కరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. వేధించే లేదా అగౌరవపరిచే భాషను వాడటం కొనసాగిస్తే, మా సహాయ సేవలను మీరు వినియోగించుకోవడంపై పరిమితులు విధించవచ్చు. మీ ఖాతా వినియోగంపై కూడా పరిమితులు విధించే అవకాశం ఉంది.
