ప్రస్తుతం యాడ్స్ మేనేజర్లో ప్రచారాలకు మార్పులు చేయడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.
నేరుగా సవరించడం (త్వరిత మార్పుల కోసం): యాడ్స్ మేనేజర్లో నేరుగా త్వరిత మార్పులు చేయండి. బడ్జెట్లను సర్దుబాటు చేయడం, ప్రకటన వచనాన్ని మార్చడం లేదా ప్రచారాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి త్వరిత మార్పుల కోసం దీన్ని ఉపయోగించండి.
సామూహిక సవరణలు (ఎక్కువ మార్పులు చేయడానికి సిఫార్సు చేయబడిన పద్ధతి): ప్రకటన స్కీమా మూసలో మీ ప్రచార డేటాను మార్చి, మళ్లీ అప్లోడ్ చేయండి. సందర్భ సూచనలు, ప్రకటన వచనం లేదా ప్రకటన లింక్ తెరిచినప్పుడు కనిపించే పేజీలను పెద్ద సంఖ్యలో మార్చడం వంటి నిర్మాణపరమైన మార్పుల కోసం దీన్ని ఉపయోగించండి.
నేరుగా సవరించడం
ప్రచార స్కీమా మూసను సవరించాల్సిన అవసరం లేని చిన్న చిన్న మార్పులను త్వరగా చేయడానికి నేరుగా సవరించే పద్ధతి అనువైనది.
ఇప్పటికే ఉన్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను సవరించండి
బడ్జెట్లను సర్దుబాటు చేయడం, ప్రకటన వచనాన్ని మార్చడం లేదా ప్రకటనలోని చిత్రాన్ని మార్చడం వంటి చిన్న మార్పుల కోసం ఈ విధానాన్ని ఉపయోగించండి.
ప్రచారం, ప్రకటన సమూహం లేదా ప్రకటనపై మౌస్ సూచికను ఉంచండి.
మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.
సవరించు ఎంపికను ఎంచుకోండి.
మీ మార్పులను నేరుగా చేయండి.
సేవ్ చేయి ఎంపికను ఎంచుకోండి.
కొత్త ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను సృష్టించండి
ఇప్పటికే ఉన్న ప్రచార నిర్మాణంలో కొత్త అంశాలను త్వరగా జోడించాలనుకున్నప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించండి.
కొత్త ప్రకటన సమూహాన్ని సృష్టించడానికి: ప్రచారంలోని ప్రకటన సమూహాలను చూడటానికి ఆ ప్రచారంపై క్లిక్ చేయండి. తర్వాత సృష్టించు, ఆపై ప్రకటన సమూహాన్ని సృష్టించు ఎంపికలపై క్లిక్ చేయండి.
కొత్త ప్రకటనను సృష్టించడానికి: ప్రకటన సమూహంలోని ప్రకటనలను చూడటానికి ఆ సమూహంపై క్లిక్ చేయండి. తర్వాత సృష్టించు, ఆపై ప్రకటనను సృష్టించు ఎంపికలపై క్లిక్ చేయండి.
సామూహిక మార్పులు
ఒకేసారి అనేక ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనల్లో మార్పులు చేయడానికి సామూహిక సవరణలు అనువైనవి.
ఇప్పటికే ఉన్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనల్లో మార్పులు చేయండి
ఇప్పటికే ఉన్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయాలనుకున్నప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించండి.
మీరు మార్చాలనుకుంటున్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను ఎంచుకోండి.
సవరణ కోసం ఎగుమతి చేయి ఎంపికపై క్లిక్ చేయండి. దీంతో మీరు ఎంచుకున్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను సవరించడానికి వాటి వివరాలతో కూడిన ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
ఎగుమతి చేసిన స్కీమా ఫైల్లో నేరుగా మార్పులు చేయండి.
యాడ్స్ మేనేజర్లో సృష్టించు, ఆపై సామూహిక అప్లోడ్ ఎంపికలపై క్లిక్ చేయండి.
సంబంధిత అంశ రకాన్ని ఎంచుకోండి: ప్రచారం, ప్రకటన సమూహం లేదా ప్రకటన. ఆపై మార్పులు చేసిన ఫైల్‌ను అప్లోడ్ చేయండి.
ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత, మీరు ఎంచుకున్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలకు మీ మార్పులు వర్తిస్తాయి.
ఇప్పటికే ఉన్న ప్రచారాల్లో కొత్త ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను సృష్టించండి
కొత్త ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను జోడించి, ఇప్పటికే ఉన్న ప్రచారాలను విస్తరించాలనుకున్నప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించండి.
కొత్త ప్రకటన సమూహాలను జోడించాలనుకుంటున్న ప్రచారంలో ఇప్పటికే ఉన్న ప్రకటన సమూహాలను ఎంచుకోండి. లేదా కొత్త ప్రకటనలను జోడించాలనుకుంటున్న ప్రకటన సమూహంలో ఇప్పటికే ఉన్న ప్రకటనలను ఎంచుకోండి.
సవరణ కోసం ఎగుమతి చేయి ఎంపికపై క్లిక్ చేయండి. దీంతో మరిన్ని ప్రకటన సమూహాలు లేదా ప్రకటనలను జోడించడానికి వీలున్న ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
స్కీమా ఫైల్లో సరైన మాతృ అంశాల ఐడీలతో కొత్త వరుసలను జోడించి, కొత్త అంశం ఐడీని ఖాళీగా ఉంచండి.
యాడ్స్ మేనేజర్లో సృష్టించు, ఆపై సామూహిక అప్లోడ్ ఎంపికలపై క్లిక్ చేయండి.
సంబంధిత అంశ రకాన్ని ఎంచుకోండి: ప్రచారం, ప్రకటన సమూహం లేదా ప్రకటన. ఆపై మార్పులు చేసిన ఫైల్‌ను అప్లోడ్ చేయండి.
ఇచ్చిన ఐడీల ఆధారంగా కొత్త ప్రకటన సమూహాలు, ప్రకటనలు సృష్టించబడి, ఇప్పటికే ఉన్న ప్రచార నిర్మాణానికి అనుసంధానించబడతాయి.
సవరణలు, సామూహిక అప్‌లోడ్‌ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
సవరించడానికి ముందు ఎందుకు ఎగుమతి చేయాలి?
సవరణ కోసం ఎగుమతి చేయి ఎంపిక ద్వారా ప్రస్తుత ఐడీలు, ఫీల్డ్ విలువలు మీకు లభిస్తాయి. ఇప్పటికే ఉన్న ప్రచారాలు, ప్రకటన సమూహాలు లేదా ప్రకటనల్లో మార్పులు చేయడానికి యాడ్స్ మేనేజర్‌కు ఇవి అవసరం. వీలైనప్పుడల్లా తాజాగా ఎగుమతి చేసిన ఫైల్‌తో ప్రారంభించండి. ముఖ్యంగా మీరు చివరిసారి ఫైల్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత ఇతర వినియోగదారులు ఖాతాలో మార్పులు చేసి ఉండే అవకాశం ఉంటే ఇలా చేయండి.
సామూహిక సవరణలకు ఏ ఐడీలు అవసరం?
ఇప్పటికే ఉన్న అంశాన్ని మార్చడానికి, ఆ అంశం ఐడీని వరుసలో అలాగే ఉంచండి. ఇప్పటికే ఉన్న ప్రచారానికి కొత్త ప్రకటన సమూహాన్ని జోడించడానికి, ఆ ప్రచారం ఐడీని కొత్త ప్రకటన సమూహం వరుసలో కాపీ చేసి, ప్రకటన సమూహం ఐడీని ఖాళీగా ఉంచండి. ఇప్పటికే ఉన్న ప్రకటన సమూహానికి కొత్త ప్రకటనను జోడించడానికి, ఆ ప్రకటన సమూహం ఐడీని కొత్త ప్రకటన వరుసలో కాపీ చేసి, ప్రకటన ఐడీని ఖాళీగా ఉంచండి.
ఒకే అప్‌లోడ్‌లో కొత్త ప్రకటన సమూహాలను, ప్రకటనలను జోడించవచ్చా?
సామూహిక అప్లోడ్ ప్రక్రియకు అవసరమైన అంశ రకాన్ని, మూసను ఉపయోగించండి. మీరు పలు రకాల అంశాలను జోడిస్తుంటే, యాడ్స్ మేనేజర్ అప్లోడ్ క్రమాన్ని అనుసరించండి. కొత్త ఉప అంశాల వరుసలు ఇప్పటికే ఉన్న మాతృ అంశం ఐడీని లేదా ముందే సృష్టించిన మాతృ అంశాన్ని సూచించేలా చూసుకోండి.
సందర్భ సూచనలను పాతవాటికి జోడిస్తారా లేదా వాటి స్థానంలో భర్తీ చేస్తారా?
సామూహిక సవరణల ద్వారా ప్రకటన సమూహాన్ని మార్చేటప్పుడు, ఆ సమూహం ఉపయోగించాలని మీరు కోరుకునే సందర్భ సూచనల పూర్తి జాబితాను ఇవ్వండి. అప్లోడ్ చేసిన విలువ ఆ ఫీల్డ్‌లోని పాత విలువ స్థానంలో భర్తీ అవుతుందని గుర్తుంచుకోండి; అది పాత విలువకు అదనంగా జోడించబడదు.
సవరించడం ద్వారా లక్ష్యాన్ని లేదా బడ్జెట్ రకాన్ని మార్చవచ్చా?
ప్రచార లక్ష్యాన్ని మార్చడానికి, మీకు కావాల్సిన లక్ష్యంతో కొత్త ప్రచారాన్ని సృష్టించండి. ప్రచారం మొత్తానికి కేటాయించిన బడ్జెట్‌ను రోజువారీ బడ్జెట్‌గా మార్చవచ్చు. అయితే, ఆ ప్రచారాన్ని మళ్లీ మొత్తం ప్రచార బడ్జెట్ విధానానికి మార్చలేరు.
సామూహిక అప్లోడ్ ఫైల్ చెల్లుబాటు తనిఖీ వివరాల కోసం, సామూహిక అప్లోడ్ ప్రచార స్కీమా తనిఖీ జాబితాను చూడండి.
