మీరు ఎంచుకున్న డేటా మూలం నుంచి అందిన కన్వర్షన్ సమాచారం కొలతలకు ఉపయోగపడుతుందో లేదో అర్థం చేసుకోవడానికి ఈవెంట్ నాణ్యత సహాయపడుతుంది. ప్రతి పిక్సెల్ లేదా డేటా మూలానికి ప్రత్యేక మదింపు ఉంటుంది. మీ సెటప్‌లో సమీక్షించాల్సిన అంశాలను మీ స్కోరు, హెచ్చరికలు సూచిస్తాయి. అవి ప్రచార పనితీరును అంచనా వేయవు లేదా కన్వర్షన్ ఒక ప్రకటనతో సరిపోలుతుందని హామీ ఇవ్వవు.
ఇటీవలి ఈవెంట్‌లు చేరుకోవడానికి సమయం ఇస్తూ, ఏడు పూర్తి క్యాలెండర్ రోజుల ఆధారంగా ఈవెంట్ నాణ్యత ప్రతిరోజూ నవీకరించబడుతుంది. మీ సెటప్‌ను మార్చిన తర్వాత, కొత్త ఈవెంట్‌లు ఆశించిన విధంగా అందుతున్నాయని నిర్ధారించుకోండి. పాత ఈవెంట్‌లు మదింపు కాలవ్యవధి నుంచి తొలగిపోయేకొద్దీ మెరుగుదలలు క్రమంగా కనిపించవచ్చు. నవీకరణ ఆలస్యమైతే, కొత్త మదింపు అందుబాటులోకి వచ్చే వరకు గతంలో అందుబాటులో ఉన్న మీ స్కోరు కనిపిస్తూనే ఉంటుంది.

హెచ్చరికలను ఎలా ఉపయోగించాలి
మీరు ఎంచుకున్న డేటా మూలానికి సంబంధించిన హెచ్చరికలను తెరిచి, ప్రతి సమస్యను సమీక్షించండి. సరిపోల్చే సమాచారం లేకపోవడం, సర్వర్ ఈవెంట్‌లు ఆలస్యంగా రావడం లేదా ఈవెంట్‌లు పదేపదే పంపబడటం వంటి, మీ అనుసంధానంలో మీరు సరిచూడగల సమస్యలతో ప్రారంభించండి. మీ సెటప్‌ను మార్చే ముందు, కారణాన్ని పరిశీలించడానికి దిగువ మార్గదర్శకాలను ఉపయోగించండి.
మీకు పంచుకోవడానికి అనుమతి ఉన్న సమాచారాన్ని మాత్రమే పంపండి. వ్యక్తి గోప్యత, సమ్మతికి సంబంధించిన ఎంపికలను గౌరవించండి. వాస్తవ కస్టమర్ సమాచారం, వాస్తవ వ్యాపార చర్యలను ఉపయోగించండి. స్కోరు మెరుగుపరచడానికి అదనపు ఈవెంట్‌లను పంపవద్దు, కల్పిత గుర్తింపులను సృష్టించవద్దు లేదా ఈవెంట్ సమయాలను మార్చవద్దు.
ఈమెయిల్ లేదా కస్టమర్ ఐడీ వివరాలు పరిమితంగా ఉన్నాయి
దీని అర్థం: ఈ తనిఖీకి అర్హత ఉన్న కన్వర్షన్ ఈవెంట్‌లలో ఈమెయిల్ లేదా స్థిరమైన కస్టమర్ ఐడీ వివరాలు పరిమితంగా ఉన్నట్లు మేము గమనించాము. ఈ గుర్తింపులు ఈవెంట్‌లను సరైన వ్యక్తితో అనుసంధానించడానికి సహాయపడతాయి. తక్కువ ఫలితం ప్రాసెసింగ్ లేదా అనుసంధాన సమస్యను కూడా సూచించవచ్చు. కాబట్టి మీ అనుసంధానం వాస్తవంగా ఏమి పంపుతోందో సమీక్షించండి.
ఏం చేయాలి:
మీ అర్హత ఉన్న కన్వర్షన్ ఈవెంట్‌లలో, మీ అనుసంధానం మద్దతిచ్చే ఫీల్డ్‌ల ద్వారా ఈమెయిల్ చిరునామా లేదా మీరు కేటాయించిన స్థిరమైన కస్టమర్ గుర్తింపు చేరుతోందో లేదో తనిఖీ చేయండి.
ఒకే వ్యక్తికి ఎల్లప్పుడూ ఒకే కస్టమర్ గుర్తింపును ఉంచండి. వేర్వేరు వ్యక్తులకు ఒకే ఉమ్మడి, తాత్కాలిక లేదా ముందుగా నిర్దేశించిన గుర్తింపును ఉపయోగించవద్దు.
మీ అనుసంధానానికి సంబంధించిన ప్రామాణిక ఆకృతికి మార్చే, హ్యాషింగ్ సూచనలను పాటించండి. మీరు బ్రౌజర్, సర్వర్ రెండింటినీ ఉపయోగిస్తే, రెండింటిలో అమలును తనిఖీ చేయండి.
మీ సాధారణ కస్టమర్ ప్రయాణం ద్వారా పూర్తయిన కన్వర్షన్‌ను పరీక్షించి, ఆశించిన ఫీల్డ్‌లు ఉన్నాయని నిర్ధారించుకోండి.
ప్రకటన క్లిక్ సమాచారం లేదు లేదా దాన్ని అనుసంధానించలేము
దీని అర్థం: మదింపు చేసిన కొన్ని ప్రకటన క్లిక్‌కు సంబంధించిన కన్వర్షన్‌లలో, అదే క్లిక్‌తో అనుసంధానించగల క్లిక్ సమాచారం లేదు. మేము మదింపు చేయగల, క్లిక్‌లకు సంబంధించిన కన్వర్షన్‌లు మాత్రమే ఈ తనిఖీ పరిధిలోకి వస్తాయి; ఇది ప్రతి ప్రకటన క్లిక్‌ను లేదా ప్రతి కస్టమర్ ప్రయాణాన్ని కొలవదు.
ఏం చేయాలి:
ఒక వ్యక్తి ప్రకటన నుంచి మీ సైట్‌కు వచ్చినప్పుడు, దారిమళ్లింపులు, పేజీల మధ్య కదలికల సమయంలో కూడా oppref పరామితిని అలాగే ఉంచండి.
మీరు కన్వర్షన్స్ ఏపీఐ ద్వారా కన్వర్షన్‌లను పంపితే, ఆ వ్యక్తి ప్రయాణానికి చెందిన క్లిక్ సమాచారాన్ని సర్వర్ ఈవెంట్‌లో చేర్చి పంపండి.
ట్రాకింగ్ లింక్‌లు, దారిమళ్లింపులు, కొనుగోలు ముగింపు ప్రక్రియ, బ్రౌజర్, సర్వర్ మధ్య జరిగే ఏదైనా బదిలీతో సహా మీ పూర్తి మార్గాన్ని పరీక్షించండి.
మరొక వ్యక్తి క్లిక్ సమాచారాన్ని తిరిగి ఉపయోగించవద్దు లేదా దాని స్థానంలో ముందుగా నిర్దేశించిన విలువను పెట్టవద్దు.
కన్వర్షన్స్ ఏపీఐ ఈవెంట్‌లు ఆలస్యమవుతున్నాయి
దీని అర్థం: మదింపు చేసిన కొన్ని సర్వర్ ఈవెంట్‌లు, నమోదైన చర్య జరిగిన చాలా సేపటి తర్వాత వచ్చాయి లేదా వాటి సమయాన్ని సరిగ్గా మదింపు చేయలేకపోయాము. చర్య జరిగిన గంటలోపు ఈవెంట్ అందిందో లేదో ఈ తనిఖీ చూస్తుంది.
ఏం చేయాలి:
వాస్తవ వ్యాపార చర్య నిర్ధారించబడిన వెంటనే ఈవెంట్‌ను పంపండి.
నిర్దేశిత సమయాల్లో జరిగే అప్‌లోడ్‌లు, నిరీక్షణ వరుసలు, విఫలమైన అభ్యర్థనలు, మళ్లీ ప్రయత్నించడంలో ఆలస్యాలను తనిఖీ చేయండి.
ఈవెంట్‌ను పంపడానికి మళ్లీ ప్రయత్నించేటప్పుడు చర్య జరిగిన అసలు సమయాన్నే ఉంచండి. దాని స్థానంలో అప్‌లోడ్ సమయాన్ని పెట్టవద్దు.
మీ అనుసంధానంలో సమయముద్ర ఆకృతి, ప్రమాణాలు, గడియార సెట్టింగ్‌లను సరిచూసుకోండి.
కన్వర్షన్ సరిపోలికలను సమీక్షించాలి
దీని అర్థం: ఆపాదన తనిఖీల సమయంలో కొన్ని సంభావ్య కన్వర్షన్ సరిపోలికలు తొలగించబడ్డాయి. ఒకే చర్యకు పదేపదే కాల్‌బ్యాక్‌లు రావడం, సమయాల్లో అసంగతత లేదా ఒకే ప్రకటన వీక్షణకు చాలా సరిపోలికలు అనుసంధానమై ఉండటం వంటివి కారణాలు కావచ్చు. దీని అర్థం వాటికి మూలమైన వ్యాపార ఈవెంట్‌లు తొలగించబడ్డాయని లేదా ప్రభావితమైన ప్రతి ఈవెంట్ చెల్లనిదని కాదు.
ఏం చేయాలి:
ఆర్డర్ నిర్ధారణ లేదా నమోదు పూర్తి కావడం వంటి వాస్తవ చర్య తర్వాతే కన్వర్షన్ ఈవెంట్ పంపబడుతోందో లేదో తనిఖీ చేయండి.
ఒకే చర్యను ఒకటి కంటే ఎక్కువసార్లు పంపగల పునరావృత పేజీ లోడ్‌లు, నకిలీ ట్యాగ్‌లు, కాల్‌బ్యాక్‌లు, మళ్లీ చేసే ప్రయత్నాలను సమీక్షించండి.
ఒకే చర్యకు చెందిన బ్రౌజర్, సర్వర్ ప్రతులతో సహా అన్ని ప్రతులకు ఒకే ఈవెంట్ ఐడీని ఉపయోగించండి; వేర్వేరు చర్యలకు వేర్వేరు ఐడీలను ఉపయోగించండి.
చర్య జరిగిన అసలు సమయముద్రను అలాగే ఉంచండి. మీ వ్యాపార రికార్డులతో ఏదైనా తేడా ఉంటే కారణాన్ని పరిశీలించండి.
ఈవెంట్‌లు కచ్చితంగా ఉన్నప్పటికీ హెచ్చరిక కొనసాగితే, డేటా మూలం, ప్రభావిత ఈవెంట్‌ల పేర్లు, తేదీల పరిధి, మీరు పూర్తి చేసిన తనిఖీల వివరాలతో సహాయ బృందాన్ని సంప్రదించండి.
అనేక కన్వర్షన్‌లు ఒకే ప్రకటన పరస్పర చర్యతో అనుసంధానమై ఉన్నాయి
దీని అర్థం: మేము మదింపు చేయగల కన్వర్షన్‌లు అసాధారణంగా కొన్ని ప్రకటన క్లిక్‌లు లేదా వీక్షణలకే ఎక్కువగా అనుసంధానమై ఉన్నాయి. ఒక పరస్పర చర్య తర్వాత కస్టమర్ చెల్లుబాటయ్యే అనేక చర్యలను పూర్తి చేయవచ్చు. కాబట్టి ఈ హెచ్చరిక ఒక్కటే నకిలీ ఈవెంట్‌లు లేదా చెల్లని కార్యకలాపం ఉన్నట్లు నిరూపించదు.
ఏం చేయాలి:
పేజీ లోడ్, రిఫ్రెష్, కాల్‌బ్యాక్ లేదా మళ్లీ చేసే ప్రయత్నం ఒకే వ్యాపార చర్యను పదేపదే పంపుతోందో లేదో తనిఖీ చేయండి.
వేర్వేరు చర్యలకు వేర్వేరు ఈవెంట్ ఐడీలు ఉన్నాయని, మళ్లీ ప్రయత్నించేటప్పుడు అసలు ఈవెంట్ ఐడీ అలాగే ఉంటుందని నిర్ధారించుకోండి.
కస్టమర్ ప్రయాణంలో ఉద్దేశించిన దశలోనే కన్వర్షన్ ఈవెంట్‌లు పంపబడుతున్నాయో లేదో సమీక్షించండి.
ఈ నమూనా వాస్తవ పునరావృత కొనుగోళ్లను లేదా చెల్లుబాటయ్యే పలు దశలను సూచిస్తే, ఆ ఈవెంట్‌లను అలాగే ఉంచండి. హెచ్చరికను సమీక్షించమని సహాయ బృందాన్ని కోరేటప్పుడు ఈ కార్యకలాపం తీరును వివరంగా నమోదు చేసి అందించండి.
సరిపోల్చడానికి అదనపు సమాచారం పరిమితంగా ఉంది
దీని అర్థం: అర్హత ఉన్న కన్వర్షన్ ఈవెంట్‌లలో సరిపోల్చడానికి అదనపు సమాచారం పరిమితంగా ఉంది. ఈ తనిఖీలో ఫోన్ వివరాలు, పేరు, స్థాన వివరాలు, అలాగే క్లయింట్ ఐపీ చిరునామా, యూజర్ ఏజెంట్‌ల కలయికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇది సమాచారం అందుబాటులో ఉందో లేదో కొలుస్తుంది, వ్యక్తిని విజయవంతంగా సరిపోల్చారా లేదా అనేది కాదు.
ఏం చేయాలి:
ఫోన్ వివరాలు అందుబాటులో ఉండి, వాటిని పంచుకోవడానికి అనుమతి ఉంటే, మీ అనుసంధానం మద్దతిచ్చే ఫీల్డ్, ఆకృతిని ఉపయోగించి వాటిని చేర్చండి.
పేరు, స్థాన వివరాల కోసం, ఒకే వ్యక్తికి చెందిన పేరు, ఇంటిపేరు, తపాలా కోడ్, దేశాన్ని అందించండి. డాక్యుమెంటేషన్‌లో పేర్కొన్న హ్యాషింగ్, ప్రామాణిక ఆకృతికి మార్చే అవసరాలను పాటించండి.
సర్వర్ ఈవెంట్‌ల కోసం, మద్దతు ఉన్నప్పుడు అసలు క్లయింట్ ఐపీ చిరునామా, యూజర్ ఏజెంట్‌ను పంపండి. వాటి స్థానంలో మీ సర్వర్ చిరునామాను లేదా సాధారణ యూజర్ ఏజెంట్‌ను ఉపయోగించవద్దు.
అర్హత ఉన్న ఈమెయిల్ లేదా స్థిరమైన కస్టమర్ ఐడీ వివరాలను కూడా పంపుతూ ఉండండి.
పరిమిత రకాల ఈవెంట్‌లు గమనించబడ్డాయి
దీని అర్థం: ఈ తనిఖీకి ఉపయోగించే ప్రామాణిక ఈవెంట్ సమూహాలైన బ్రౌజింగ్, మధ్యంతర చర్యలు, పూర్తయిన ఫలితాల్లో పరిమిత కార్యకలాపాన్ని మేము గమనించాము. వేర్వేరు వ్యాపారాల్లో కస్టమర్ ప్రయాణాలు వేర్వేరుగా ఉంటాయి; ప్రతి దశ అన్నింటికీ వర్తించదు. ఈ తనిఖీ మీ మొత్తం కన్వర్షన్ ప్రక్రియలోని అన్ని దశలు నమోదయ్యాయో లేదో ధ్రువీకరించదు.
ఏం చేయాలి:
మీ కస్టమర్ ప్రయాణంలోని వాస్తవ దశలను గుర్తించి, వాటిలో మీ వ్యాపారానికి వర్తించే దశలను నిర్ధారించండి.
కంటెంట్ చూడటం; వస్తువులను జోడించడం, కొనుగోలు ముగింపు ప్రక్రియను ప్రారంభించడం లేదా ఆసక్తిగల కస్టమర్ వివరాలను సమర్పించడం; ఆర్డర్‌ను పూర్తి చేయడం, ప్రయోగ వినియోగాన్ని ప్రారంభించడం లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేయడం వంటి వర్తించే చర్యలు నమోదవుతున్నాయో తనిఖీ చేయండి.
మద్దతు ఉన్న ప్రామాణిక ఈవెంట్ ఒక చర్యను కచ్చితంగా సూచిస్తే, దాన్ని ఉపయోగించండి. ఎన్ని రకాల ఈవెంట్‌లు నమోదవుతున్నాయో చూసే ఈ ప్రత్యేక తనిఖీలో అనుకూల ఈవెంట్‌లు చేర్చబడవు.
ప్రతి ఈవెంట్ దానికి సంబంధించిన చర్య జరిగినప్పుడే పంపబడుతోందని పరీక్షించండి. హెచ్చరికను తొలగించడానికి కన్వర్షన్ ప్రక్రియలో కృత్రిమ దశలను సృష్టించవద్దు.
పిక్సెల్, కన్వర్షన్స్ ఏపీఐ కార్యకలాపం పరిమితంగా ఉంది
దీని అర్థం: మద్దతు ఉన్న పిక్సెల్ ఎస్‌డీకే లేదా కన్వర్షన్స్ ఏపీఐ ఛానెల్‌ల వినియోగాన్ని సానుకూలంగా మదింపు చేయడానికి సరిపడా ఆమోదిత కార్యకలాపం వాటి నుంచి మాకు కనిపించలేదు. అనుసంధానాన్ని ఇన్‌స్టాల్ చేసినంత మాత్రాన ఈవెంట్‌లు అందుతున్నట్లు నిర్ధారణ కాదు.
ఏం చేయాలి:
మీ సెటప్‌కు వర్తించే మేరకు, మీ పిక్సెల్ ఎస్‌డీకే బ్రౌజర్ ఈవెంట్‌లను, మీ కన్వర్షన్స్ ఏపీఐ అనుసంధానం నిర్ధారిత సర్వర్ ఫలితాలను పంపుతున్నాయని సరిచూసుకోండి.
అభ్యర్థనలు ఆమోదించబడుతున్నాయని, ఉద్దేశించిన డేటా మూలానికే పంపబడుతున్నాయని తనిఖీ చేయండి.
రెండు ఛానెల్‌లు ఒకే చర్యను నివేదించినప్పుడు, ప్రతులను గుర్తించగలిగేలా ఒకే పిక్సెల్ ఐడీ, ఈవెంట్ పేరు, ఈవెంట్ ఐడీని ఉపయోగించండి.
వేర్వేరు చర్యలకు వేర్వేరు ఈవెంట్‌లను ఉంచండి. ఫలితాలు సంభవించకముందే వాటిని పంపవద్దు.
రెండు ఛానెల్‌లను ఉపయోగించడం వల్ల ఒకదానికొకటి పూరకమైన సమాచారం అందవచ్చు. ఛానెల్ కార్యకలాపం ఒక్కటే సరైన జతకల్పనను లేదా ఈవెంట్‌ల పూర్తి నమోదును ధ్రువీకరించదు.
సెటప్ చేసిన కన్వర్షన్ లక్ష్యానికి కార్యకలాపం పరిమితంగా ఉంది
దీని అర్థం: సెటప్ చేసిన కన్వర్షన్ లక్ష్యాల్లో కనీసం ఒకదానికి మదింపు కాలవ్యవధిలో చాలా తక్కువ ఈవెంట్‌లు అందాయి లేదా ఏవీ అందలేదు. ఈ హెచ్చరిక కనిపిస్తున్నప్పటికీ ఇతర లక్ష్యాలకు తగినంత కార్యకలాపం ఉండవచ్చు. ఈ తనిఖీ కోసం స్వీకరించిన ఈవెంట్‌లలో ప్రకటనతో సరిపోలని ఈవెంట్‌లు కూడా ఉంటాయి.
ఏం చేయాలి:
ప్రభావిత లక్ష్యానికి చెందిన ఈవెంట్ పేరు, సెట్టింగ్‌లను మీ అనుసంధానం పంపే ఈవెంట్‌లతో పోల్చండి.
వాస్తవ చర్య జరిగినప్పుడు ఈవెంట్ పంపబడుతోందని, ఇటీవలి ఈవెంట్‌లు అందుతున్నాయని నిర్ధారించుకోండి.
కాలం చెల్లిన లేదా మీరు కొలవాలనుకునే చర్యలను ఇకపై సూచించని లక్ష్యాలను సమీక్షించండి.
ఆ చర్య నిజంగానే అరుదుగా జరిగేదైతే లేదా ఇటీవల డిమాండ్ తక్కువగా ఉంటే, దాన్ని పర్యవేక్షిస్తూ ఉండండి. సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన సెటప్‌లో లోపం ఉన్నట్లు నిర్ధారణ కాదు.
స్కోరు లేదా తనిఖీ ఎందుకు అందుబాటులో ఉండకపోవచ్చు
కన్వర్షన్ లక్ష్యాలు ఏవీ సెటప్ చేయలేదు: మీరు కొలవాలనుకునే కన్వర్షన్ చర్యలను సెటప్ చేశారని, మీ అనుసంధానం వాటికి సంబంధించిన ఈవెంట్‌లను పంపుతోందని నిర్ధారించుకోండి.
తగినంత కన్వర్షన్ కార్యకలాపం లేదు: ఉపయోగకరమైన స్కోరును లెక్కించడానికి ఇటీవల తగినంత కన్వర్షన్ కార్యకలాపం జరిగి ఉండకపోవచ్చు. మీ సెటప్‌ను సరిచూసుకుని, వాస్తవ కార్యకలాపం నమోదు కావడానికి సమయం ఇవ్వండి. ఈ స్థితి, స్కోరు సున్నాగా ఉండటానికి భిన్నమైనది.
ఆపాదనకు తగిన ఆధారాలు లేవు: కొన్ని తనిఖీలకు కన్వర్షన్ ఈవెంట్‌లు, ప్రకటన క్లిక్‌లు లేదా వీక్షణల మధ్య గుర్తించగల సంబంధాలు అవసరం. ఈ ఆధారాలు పరిమితంగా ఉన్నప్పటికీ మీరు ఈవెంట్‌లను స్వీకరిస్తూ ఉండవచ్చు. దీని అర్థం మీ వ్యాపారంలో వాస్తవ కన్వర్షన్‌లు లేవని కాదు.
తనిఖీకి సమాచారం పరిమితంగా ఉంది: ఒక నిర్దిష్ట తనిఖీకి మరిన్ని అర్హత ఉన్న ఈవెంట్‌లు లేదా మరింత గుర్తించగల కార్యకలాపం అవసరం కావచ్చు. సమాచారం లేకపోవడాన్ని తనిఖీ విఫలమైనట్లుగా పరిగణించరు. దాని వల్ల ప్రకటనదారుకు స్వయంచాలకంగా హెచ్చరిక కూడా రాదు.
డేటా ప్రాసెసింగ్ ఇంకా జరుగుతోంది: మొదటి మదింపు సిద్ధమయ్యే ముందు లేదా తాజా మదింపు పూర్తికాకపోతే స్కోరు అందుబాటులో ఉండకపోవచ్చు. రోజువారీ నవీకరణ ఆలస్యమైనంత మాత్రాన ఇప్పటికే ఉన్న స్కోరు తొలగిపోదు. ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ చూడండి. అందుబాటులో లేని స్థితి కొనసాగితే, సహాయ బృందాన్ని సంప్రదించండి.
మార్పు చేసిన తర్వాత, అనుసంధానం ఇప్పుడు సరైన చర్యలను, సమాచారాన్ని నమోదు చేస్తోందో లేదో ముందుగా గమనించండి. మదింపు కాలవ్యవధి ముందుకు కదిలేకొద్దీ స్కోరు క్రమంగా మారవచ్చు. ఏ స్కోరు కూడా సరిపోలిక, ఆపాదన లేదా ప్రచార ఫలితాలకు హామీ ఇవ్వదు.
