బడ్జెట్ ఖర్చు వేగాన్ని నియంత్రించడం వల్ల మీ ప్రచార వ్యయాన్ని కాలవ్యవధి అంతటా విస్తరించవచ్చు. ప్రకటనల రద్దీ, ప్రదర్శన అవకాశాలు మారుతున్నప్పుడు, ఆ రోజులో లేదా ప్రచారంలో తర్వాత వచ్చే అవకాశాల కోసం బడ్జెట్ మిగిలి ఉండేలా యాడ్స్ మేనేజర్ ప్రకటనల ప్రదర్శనను సర్దుబాటు చేస్తుంది.
మీ ఖర్చు రోజురోజుకూ మారవచ్చు. ఖర్చు వేగ నియంత్రణ వల్ల సమానంగా ఖర్చవుతుందని లేదా మీ ప్రచార బడ్జెట్ మొత్తం ఖర్చవుతుందని హామీ లేదు.
రోజువారీ బడ్జెట్ ఖర్చు వేగ నియంత్రణ
రోజువారీ బడ్జెట్ ఉన్న ప్రచారాల కోసం, యాడ్స్ మేనేజర్ రోజంతా ప్రకటనలు ప్రదర్శితమయ్యే వేగాన్ని నియంత్రిస్తుంది. మీ ప్రకటనల ఖాతా సమయ మండలంలో ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే బడ్జెట్ వారానికి సంబంధించి, మీ రోజువారీ బడ్జెట్ అనేది రోజుకు సగటున ఖర్చు చేసే మొత్తం. కాబట్టి, వర్తించే ఖర్చు పరిమితులకు లోబడి, కొన్ని రోజుల్లో ఎక్కువగా, మరికొన్ని రోజుల్లో తక్కువగా ఖర్చవవచ్చు.
రోజువారీ బడ్జెట్‌లు, ఖర్చు పరిమితులు, బడ్జెట్ మార్పుల వివరాల కోసం రోజువారీ బడ్జెట్‌లు చూడండి.
ప్రచార మొత్తం బడ్జెట్ ఖర్చు వేగ నియంత్రణ
ప్రచార మొత్తం బడ్జెట్ ఉన్న ప్రచారాల్లో, కాలవ్యవధి అంతటా ఖర్చును నియంత్రించడానికి యాడ్స్ మేనేజర్ మిగిలిన బడ్జెట్‌ను, ప్రచార సమయ ప్రణాళికను పరిగణనలోకి తీసుకుంటుంది.
మీ ప్రచారంలో నిర్దేశిత వేగం కంటే త్వరగా ఖర్చవుతుంటే, తర్వాతి అవసరాల కోసం బడ్జెట్‌ను మిగిల్చేందుకు ప్రకటనల ప్రదర్శన వేగం తగ్గవచ్చు. నిర్దేశిత వేగం కంటే నెమ్మదిగా ఖర్చవుతుంటే, ఆ లోటును పూడ్చుకునే అవకాశం ఉండేలా ప్రకటనల ప్రదర్శన కొనసాగవచ్చు. ఊహించని విధంగా బడ్జెట్ ముందుగానే అయిపోయే అవకాశాన్ని తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. అయితే, వాస్తవ ఖర్చు అందుబాటులో ఉన్న ప్రకటనల ప్రదర్శన అవకాశాలపైనే ఆధారపడి ఉంటుంది.
మీరు అనుకున్న ప్రచార వ్యవధికి తగ్గట్టుగా ఖర్చు వేగాన్ని నియంత్రించేందుకు ముగింపు తేదీని సెట్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
తరచుగా అడిగే ప్రశ్నలు
నా ప్రచార మొత్తం బడ్జెట్ ప్రచారం ముగింపు తేదీ వరకు సరిపోతుందా.
తప్పనిసరిగా సరిపోతుందని చెప్పలేము. ముగింపు తేదీ అనేది మీ ప్రచార ప్రకటనలను ప్రదర్శించగల చివరి తేదీ. అయితే మీ బడ్జెట్ అంతకంటే ముందే పూర్తిగా ఖర్చవవచ్చు. ఖర్చు వేగ నియంత్రణ కాలవ్యవధి అంతటా వ్యయాన్ని నిర్వహించడంలో తోడ్పడుతుంది. అయితే మీ బడ్జెట్ ముగింపు తేదీ వరకు సరిపోతుందని హామీ ఇవ్వదు.
ప్రచార మొత్తం బడ్జెట్ ఉన్న ప్రచారంలో ఖర్చు వేగ నియంత్రణకు పరిగణించే వ్యవధి ఎంత.
ముగింపు తేదీ ఉన్న ప్రచారాల కోసం, యాడ్స్ మేనేజర్ ఆ తేదీ వరకు ఉన్న సమయాన్ని ఖర్చు వేగ నియంత్రణకు పరిగణిస్తుంది. ఈ వ్యవధి గరిష్ఠంగా 365 క్యాలెండర్ రోజులు ఉంటుంది. ముగింపు తేదీ లేని ప్రచారాల్లో ఖర్చు వేగ నియంత్రణకు ముందుగా నిర్ణయించిన 60 రోజుల వ్యవధి వర్తిస్తుంది.
మీరు అనుకున్న ప్రచార వ్యవధికి తగ్గట్టుగా ఖర్చు వేగాన్ని నియంత్రించేందుకు ముగింపు తేదీని సెట్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ వ్యవధులు ఖర్చును నియంత్రించేందుకు ఆధారంగా ఉంటాయి. మీ బడ్జెట్ ఆ వ్యవధి అంతటికీ సరిపోతుందని లేదా పూర్తిగా ఖర్చవుతుందని హామీ ఇవ్వవు.
ముగింపు తేదీ లేకుండా ప్రచార మొత్తం బడ్జెట్‌ను ఉపయోగించవచ్చా.
అవును. ప్రచార మొత్తం బడ్జెట్ ఉండి, ముగింపు తేదీ లేని ప్రచారాల కోసం యాడ్స్ మేనేజర్ ఖర్చు వేగ నియంత్రణకు ముందుగా నిర్ణయించిన వ్యవధిని ఉపయోగిస్తుంది. మీరు అనుకున్న ప్రచార సమయ ప్రణాళికకు అనుగుణంగా ఖర్చు వేగాన్ని నియంత్రించాలంటే, ముగింపు తేదీని సెట్ చేయండి.
నా ప్రచార మొత్తం బడ్జెట్‌ను లేదా ముగింపు తేదీని మార్చితే ఏమవుతుంది.
మీరు మార్చిన బడ్జెట్ లేదా సమయ ప్రణాళిక ఆధారంగా యాడ్స్ మేనేజర్ ఖర్చు వేగాన్ని మళ్లీ లెక్కిస్తుంది. మీరు సవరించిన ప్రచార మొత్తం బడ్జెట్ ఇప్పటికే ఖర్చయిన మొత్తానికి తగ్గకుండా ఉండాలి. దాన్ని ఇప్పటికే ఖర్చయిన మొత్తానికి సమానంగా సెట్ చేస్తే, ప్రకటనల ప్రదర్శన ఆగిపోతుంది.
నా వేలంపాట వ్యూహాన్ని మార్చితే ప్రచారంలో ఖర్చు వేగం పెరుగుతుందా.
మీ వేలంపాట వ్యూహాన్ని మార్చినా, ప్రచార మొత్తం బడ్జెట్ ఖర్చు వేగ నియంత్రణ యథావిధిగా వర్తిస్తుంది. వేలంపాటలో తక్కువ ధరలు ప్రతిపాదిస్తే, ప్రకటనల ప్రదర్శన పరిమితమై మీ ప్రచారంలో బడ్జెట్ కంటే తక్కువ ఖర్చయ్యే అవకాశం ఇప్పటికీ ఉంటుంది.
