అవలోకనం
AIతో రూపొందించిన చిత్రాలతో సహా, చిత్రాల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ఉండే అవకాశాన్ని పరిశీలించేందుకు OpenAI CSAM చిత్ర వర్గీకరణ సాధనం అనుమతి పొందిన సంస్థలకు తోడ్పడుతుంది. ఈ సాధనాన్ని OpenAI ఏపీఐ ద్వారా ఉపయోగించవచ్చు. ఇందుకు అనుమతి అవసరం.
అనుమతి పొందిన సంస్థలు OpenAI CSAM చిత్ర వర్గీకరణ సాధనాన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు.
వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేయండి
వినియోగ అనుమతి కోరడానికి:
వర్గీకరణ సాధనం కోసం దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
సూచించినప్పుడు పర్సోనా ద్వారా ధృవీకరణను పూర్తి చేయండి.
వినియోగ అనుమతి పొందడానికి కార్యక్రమంలో చేరే ప్రక్రియను పూర్తి చేసి, CSAM వర్గీకరణ సాధన కార్యక్రమ నిబంధనలను అంగీకరించాలి.
మీరు దరఖాస్తు చేసిన తర్వాత
దరఖాస్తు సమర్పించినంత మాత్రాన వినియోగ అనుమతి లభించదు. మీ దరఖాస్తు ఆమోదం పొంది, మీ ఏపీఐ సంస్థకు వర్గీకరణ సాధనాన్ని ఉపయోగించే అనుమతి కల్పించిన తర్వాత csamclassifier@openai.com నుంచి మీకు ఇమెయిల్ వస్తుంది.
మీ దరఖాస్తు విషయంలో సహాయం పొందండి
దరఖాస్తు లేదా వినియోగ అనుమతి గురించి ప్రశ్నలుంటే, csamclassifier@openai.comను సంప్రదించండి.
సంబంధిత మార్గదర్శకాలు
CSAMను నిరోధించడం, గుర్తించడం, దానిపై చర్యలు తీసుకోవడం గురించి మార్గదర్శకాల కోసం డెవలపర్‌ల కోసం CSAM మార్గదర్శకాలు చూడండి.