2025 మే 21 నాటికి, రెస్పాన్సెస్ ఏపీఐకి కొత్త అంతర్నిర్మిత సాధనాలను జోడించాం—రిమోట్ ఎంసీపీ సర్వర్లు, ఇమేజ్ జనరేషన్, కోడ్ ఇంటర్‌ప్రెటర్, మెరుగుపరిచిన ఫైల్ శోధన. వీటితో పాటు నేపథ్య మోడ్, గుప్తీకరించిన కంటెంట్‌కు మద్దతును కూడా జోడించాం. దీంతో మీరు మరింత సమగ్రమైన సందర్భ సమాచారాన్ని సేకరించి, మరింత విశ్వసనీయంగా పనిచేసే ఏజెంట్లను రూపొందించవచ్చు. వివరాల కోసం, మా రెస్పాన్సెస్ ఏపీఐ పత్రాలను చూడండి.
ప్రస్తుత సంఘటనల గురించి OpenAI ఏపీఐ మోడళ్లకు ఎంతవరకు తెలుసనేది ఆయా మోడళ్లపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మోడల్‌కు ఏ తేదీ వరకు ఉన్న సమాచారం తెలుసనే వివరాలు మా మోడళ్ల అవలోకనం పేజీలో ఉన్నాయి.
మోడళ్లకు తాజా సమాచారాన్ని అందించండి
మోడల్ శిక్షణలో చేర్చిన సమాచారం ముగిసే తేదీకి, ప్రస్తుత సంఘటనలకు మధ్య ఉన్న సమాచార లోటును పూరించడానికి, OpenAI రెస్పాన్సెస్ ఏపీఐ ద్వారా అందుబాటులో ఉన్న ఈ అంతర్నిర్మిత శోధన సాధనాలను ఉపయోగించవచ్చు:
వెబ్ శోధన: మోడల్ నేరుగా అంతర్జాలం నుంచి తాజా సమాచారాన్ని పొందేలా చేస్తుంది.
ఫైల్ శోధన: మీరు వెక్టర్ నిల్వలకు అప్‌లోడ్ చేసే ఫైళ్ల నుంచి మోడల్ సమాచారాన్ని పొందేలా చేస్తుంది.
ఈ సాధనాలు మోడల్ శిక్షణ డేటాలో లేని సమాచారాన్ని కూడా సేకరించగలవు. వెబ్ శోధన అంతర్జాలం నుంచి తాజా సమాచారాన్ని అందించగలదు; ఫైల్ శోధన మీరు అందించే ఫైళ్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది.
తాజా సమాచారాన్ని పొందే సదుపాయాన్ని ప్రారంభించండి
మీ ఏపీఐ మోడళ్లకు తాజా సమాచారాన్ని అందించడానికి:
మీ పని ప్రక్రియలో రెస్పాన్సెస్ ఏపీఐని అనుసంధానించండి.
ఏపీఐ కాల్‌లు చేసేటప్పుడు వెబ్ శోధన, ఫైల్ శోధన సాధనాల్లో ఒకదాన్ని లేదా రెండింటినీ ప్రారంభించండి.
ప్రారంభించిన సాధనాన్ని ఉపయోగించాలా వద్దా అనేది మీ ప్రాంప్ట్ ఆధారంగా మోడల్ నిర్ణయిస్తుంది.
tool_choiceపరామితితో సాధనాల వినియోగాన్ని నియంత్రించవచ్చు.
రెస్పాన్సెస్ ఏపీఐని ఉపయోగించడం గురించి, వెబ్, ఫైల్ శోధన గురించి మరింత తెలుసుకోండి.
