అవలోకనం
హానికరమైనవి లేదా తన వినియోగ విధానాలను ఉల్లంఘించేవి అయ్యే అవకాశం ఉన్న విషయాలను గుర్తించడానికి OpenAI స్వయంచాలక వ్యవస్థలను, వినియోగదారుల నివేదికలను ఉపయోగిస్తుంది. పరిస్థితిని బట్టి, ChatGPT ప్రతిస్పందనను పరిమితం చేయవచ్చు, పంచుకోవడంపై ఆంక్షలు విధించవచ్చు, సంభాషణను ముగించవచ్చు లేదా ఖాతాను ఉపయోగించే అవకాశాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. OpenAI ఖాతాపై లేదా GPTపై వేరుగా చర్య కూడా తీసుకోవచ్చు.
తన నమూనాలను విడుదల చేయడానికి ముందు భద్రత, మానవ ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయడం కోసం OpenAI నిర్వహించే పరీక్షలను, ప్రమాద తగ్గింపు చర్యలను ఈ రక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తాయి.
హానికరమయ్యే అవకాశం ఉన్న విషయాలను గుర్తించడం
ప్రాంప్ట్‌లు, ప్రతిస్పందనలు, ఎక్కించిన దస్త్రాలు, GPTలలో హానికరమయ్యే అవకాశం ఉన్న విషయాలను గుర్తించడానికి OpenAI స్వయంచాలక పర్యవేక్షణ సాధనాలను ఉపయోగిస్తుంది.
ఒక వ్యక్తి ముందుగా సంభాషణను సమీక్షించకుండానే, ChatGPT కొన్ని భద్రతా చర్యలను స్వయంచాలకంగా తీసుకోగలదు. ఎవరైనా ఒక విషయంపై నివేదించినప్పుడు, ఆ నివేదికను అంచనా వేయడానికి OpenAI స్వయంచాలక వ్యవస్థలను, శిక్షణ పొందిన సమీక్షకులను ఉపయోగిస్తుంది.
ChatGPT, ChatGPT ఇమేజెస్‌లో తీసుకునే చర్యలు
విషయం OpenAI విధానాలను ఉల్లంఘించే అవకాశం ఉన్నా, భద్రతపై ఆందోళన కలిగించినా, ChatGPT ఈ చర్యలు తీసుకోవచ్చు:
మీరు అందించిన విషయం OpenAI వినియోగ విధానాలను ఉల్లంఘించే అవకాశం ఉందని మిమ్మల్ని హెచ్చరించవచ్చు.
ప్రాంప్ట్‌కు స్పందించడానికి నిరాకరించవచ్చు.
సంభాషణను పంచుకోకుండా నిరోధించవచ్చు.
హింస లేదా ఇతరులకు హాని కలిగించడం గురించి తీవ్ర ఆందోళన కలిగించే సంభాషణను ముగించవచ్చు.
సంభాషణలను పదేపదే ముగించిన తర్వాత కూడా, తదుపరి సంభాషణలు హింస లేదా ఇతరులకు హాని కలిగించడం గురించి తీవ్ర ఆందోళన కలిగిస్తే, మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
విధానాలను తీవ్రంగా లేదా పదేపదే ఉల్లంఘించినందుకు OpenAI వేరుగా చర్య తీసుకుని ఖాతాను శాశ్వతంగా మూసివేయవచ్చు.
ముగించిన సంభాషణలు
ChatGPT ఒక సంభాషణను ముగిస్తే, అది ఇకపై మీ సంభాషణల చరిత్రలో లేదా శోధన ఫలితాల్లో కనిపించదు. మీ ఖాతాను నిలిపివేయకపోతే లేదా దానిపై ఇతర ఆంక్షలు లేకపోతే, మీరు కొత్త సంభాషణను ప్రారంభించవచ్చు.
ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయడం
ChatGPT మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తే, వెంటనే మీ ఖాతా నుంచి నిష్క్రమింపజేస్తుంది. నిలిపివేత అమల్లో ఉన్నంతకాలం మీరు ఖాతాలోకి ప్రవేశించలేరు లేదా ChatGPTని ఉపయోగించలేరు. తాత్కాలిక నిలిపివేత, ఖాతాను శాశ్వతంగా మూసివేయడం వేర్వేరు.
ఈ చర్యల గురించి మరింత సమాచారం కోసం హింసకు సంబంధించిన ఆందోళనల కారణంగా ChatGPT మీ సంభాషణను ఎందుకు ముగించింది లేదా మీ ఖాతాను ఎందుకు తాత్కాలికంగా నిలిపివేసింది చూడండి.
ఖాతాను శాశ్వతంగా మూసివేయడం
తన విధానాలను తీవ్రంగా లేదా పదేపదే ఉల్లంఘించినందుకు OpenAI ఖాతాను శాశ్వతంగా మూసివేయవచ్చు. ఈ చర్య సంభాషణను ముగించడం లేదా ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడం కంటే వేరైనది.
ఖాతాను శాశ్వతంగా మూసివేయడం, ఖాతా సమీక్షకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవడానికి OpenAI ఖాతాల మూసివేతలు, భద్రత కోసం నిలిపివేతలు చూడండి.
GPTలకు సంబంధించిన చర్యలు
GPTకి సంబంధించిన విషయాల్లో సమస్యాత్మకమైనవిగా ఉండే అవకాశం ఉన్నవాటిని గుర్తించడానికి OpenAI స్వయంచాలక సాధనాలను కూడా ఉపయోగిస్తుంది. GPT, OpenAI విధానాలను ఉల్లంఘించే అవకాశం ఉంటే, దాన్ని ఇతరులకు అందుబాటులోకి తీసుకురాకుండా OpenAI నిరోధించవచ్చు.
సమస్యను పరిష్కరించడానికి GPT సృష్టికర్త ఆ GPTని లేదా API ఆకృతీకరణను నవీకరించవచ్చు. ఉత్పత్తిలోనే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటే, సృష్టికర్త దాన్ని ఉపయోగించి సమీక్షను కోరవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన సందర్భాల్లో, OpenAI సృష్టికర్త ఖాతాను కూడా శాశ్వతంగా మూసివేయవచ్చు.
సమస్యాత్మక విషయాలపై నివేదించడం
ఏదైనా విషయం OpenAI విధానాలను ఉల్లంఘించే అవకాశం ఉందని లేదా మరో విధంగా భద్రతపై ఆందోళన కలిగిస్తుందని మీరు భావిస్తే, దానిపై నివేదించవచ్చు. సమర్పించిన నివేదికలను అంచనా వేయడానికి OpenAI స్వయంచాలక వ్యవస్థలను, శిక్షణ పొందిన సమీక్షకులను ఉపయోగిస్తుంది.
నేరుగా ChatGPTలో ఉన్న విషయాలపై నివేదించడానికి ChatGPT, OpenAI వేదికల్లోని విషయాలపై నివేదించడం చూడండి.
పంచుకున్న ChatGPT సంభాషణపై నివేదించడానికి పంచుకున్న లంకెలోని హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన విషయాలపై నివేదించడం చూడండి.
GPTపై నివేదించడానికి GPTపై నివేదించడం చూడండి.
ఎవరైనా తక్షణ ప్రమాదంలో ఉండవచ్చని అనిపిస్తే, స్థానిక అత్యవసర సేవలను సంప్రదించండి. OpenAIకి విషయాలను నివేదించడం అత్యవసర సహాయానికి ప్రత్యామ్నాయం కాదు.
