మరిన్ని వివరాల కోసం మా ఫైల్ అప్‌లోడ్‌ల FAQ చూడండి.
ఫైల్‌లను అప్‌లోడ్ చేసే సదుపాయం కింది పనులకు ఉపయోగపడేలా రూపొందించబడింది:
సంశ్లేషణ: ఫైల్‌లు, పత్రాల్లోని సమాచారాన్ని కలిపి లేదా విశ్లేషించి కొత్తదాన్ని రూపొందించడం. ఉదాహరణకు:
గుణాత్మక, పరిమాణాత్మక సమాచారం కలగలిసిన CSV వంటి స్ప్రెడ్‌షీట్‌ను అప్‌లోడ్ చేసి, అందులోని డేటాను అర్థం చేసుకోవడానికి, దృశ్యరూపంలో చూపడానికి సహాయం చేయమని ChatGPTను అడగండి.
రెండు పత్రాల్లోని సారూప్యతలు, తేడాలను పోల్చండి.
పత్రంలో వ్యక్తమైన భావాన్ని లేదా ధోరణిని విశ్లేషించండి.
స్ప్రెడ్‌షీట్‌ను విశ్లేషించండి.
ఒక పత్రంలోని చట్రాన్ని లేదా మూల్యాంకన ప్రమాణాలను మరొక పత్రంలోని విషయాలకు వర్తింపజేయండి.
రూపాంతరం: పత్రాల్లోని సమాచారం యొక్క అసలు సారాన్ని మార్చకుండా దానికి కొత్త రూపమివ్వడం. ఉదాహరణకు:
సంక్లిష్టమైన పరిశోధన పత్రాన్ని అప్‌లోడ్ చేసి, దాని గురించి సరళమైన సారాంశం ఇవ్వమని ChatGPTను అడగండి.
PowerPoint ప్రజెంటేషన్‌ను అప్‌లోడ్ చేసి, అందులోని విషయంపై అభిప్రాయం ఇవ్వమని ChatGPTను అడగండి.
పత్రాన్ని సరళమైన పదాల్లో సంగ్రహించండి.
చిన్న పత్రాన్ని ఒక నిర్దిష్ట శైలిలో తిరిగి రాయండి.
ప్రజెంటేషన్‌ను పత్రంగా మార్చండి.
సమాచార వెలికితీత: పత్రం నుంచి నిర్దిష్ట సమాచారాన్ని వెలికితీయడం. ఉదాహరణకు:
PDFను అప్‌లోడ్ చేసి, ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రస్తావనలను కనుగొనమని ChatGPTను అడగండి.
పత్రం నుంచి సంబంధిత ఉల్లేఖనాలను వెలికితీయండి.
పత్రం లేదా స్ప్రెడ్‌షీట్‌లో ఒక నిర్దిష్ట అంశం ఎక్కడైనా ప్రస్తావించబడిందేమో వెతకండి.
పత్రం నుంచి మెటాడేటాను (రచయిత, సృష్టించిన తేదీ మొదలైనవి) వెలికితీయండి.
ఒక నిర్దిష్ట లక్షణం ఉన్న స్ప్రెడ్‌షీట్ వరుసల సంఖ్యను లెక్కించండి.
పత్రంలోని నిర్దిష్ట విభాగాలను (ఉదాహరణకు, అన్ని శీర్షికలు లేదా అన్ని బుల్లెట్ జాబితాలు) వెలికితీయండి.
